పోటుగాడికి వస్తున్న స్పందనతో ఆనందంలో వున్న మనోజ్

potugadu_movie_trailer_laun

‘పోటుగాడు’ సినిమాకు సంబంధించి మంచి టాక్ ను మొదటిరోజు చాలా చోట్లనుండి మీడియా మరియు పబ్లిక్ ద్వారా ఈ సినిమా టీం అందుకున్నారు. మనోజ్ చేసిన కష్ట తరమైన షాట్ లని కేవలం మేకింగ్ వీడియోలో చూస్తేనే తన తపనకు, శ్రమకు తగిన ఫలితం వచ్చిందని అనుకోవచ్చు

ఈ ఆనందాన్ని మనోజ్ ట్విట్టర్ లో మనతో మనోజ్ పంచుకుంటూ “అందరికీ ధన్యవాదాలు 🙂 హిట్ తో ఆశీర్వదించినందుకు కృతజ్ఞున్ని:) మీ సూచనలను తీసుకుని తరువాత సినిమాలో మరింత కృషి చేస్తాను. లవ్ యు ఆల్ 😉 థాంక్ యు” అని పెర్కున్నాడు

ఈ వారాంతరంలో విడుదలైన తక్కువ సినిమాలలో ఈ సినిమా ఒకటి. ఈ ‘పోటుగాడు’ బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాగే కొనసాగితే ఈ సినిమా మనోజ్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలుస్తుంది. చూద్దాం ఏమవుతుందో.

Exit mobile version