ఉగాది కానుకగా ‘మనం’ వస్తుంది – నాగార్జున

ఉగాది కానుకగా ‘మనం’ వస్తుంది – నాగార్జున

Published on Mar 2, 2014 11:30 AM IST

manam
అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘మనం’ సినిమా మార్చ్ 31న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే నాగార్జున, అఖిల్ తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అక్కడ మీడియాతో నాగార్జున మాట్లాడుతూ ‘ మేము అనుకున్న రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు. ఉగాది కానుకగా మనం సినిమా రిలీజ్ అవుతుంది. మా తల్లి తండ్రుల ఆత్మసంతృప్తి గా ఉండాలని నేను, అఖిల్ వచ్చి పూజలు చేసాం. నాకు తెలిసి వాళ్ళిద్దరూ స్వర్గంలో హ్యాపీగా ఉంటారని’ అన్నాడు.

మనం సినిమాలో సమంత, శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ లోని ముగ్గురు హీరోలు కలిసి చేస్తున్న మొదటి సినిమా మనం. అలాగే అక్కినేని గారి చివరి సినిమా కూడా ఇదే కావడం వల్ల అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. గతంలో కూడా నాగార్జున అందరూ మనం సినిమాని పెద్ద హిట్ చేసి ఎఎన్ఆర్ కి అంకితం ఇవ్వాలని కోరాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని ఈ చిత్ర టీం చెబుతోంది.

తాజా వార్తలు