సంక్రాంతి కానుకగా అక్కినేని ‘మనం’

Manam-Movie-launch
మూడు తరాల అక్కినేని హీరోలు నటిస్తున్న ‘మనం’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున తెలిపారు. ‘మనం’ సినిమా కార్యక్రమాలు ఇటీవలే హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. తండ్రి, తనయుడు నటిస్తున్న డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో నాగార్జున భావోద్వేగానికి లోనయ్యాడు.

బ్యాచలర్ ఎండ్ మాస్టర్స్ ఆఫ్ పిల్మ్, మీడియా కోర్సులను అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్టిట్యూట్, జవహర్ లాల్ నెహ్రూ ఫైనార్ట్స్ యూనివర్శిటీ సంయుక్తంగా ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందం కార్యక్రమంలో నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మనం’ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలిపారు. నాన్న గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్టిట్యూట్ అని, ప్రస్తుతం భారతదేశంలోనే నెంబర్ వన్ ఫిల్మ్ ఇన్టిట్యూట్ గా అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్సిట్యూట్ ఖ్యాతి గాంచిందని నాగ్ చెప్పారు. ఫిల్మ్ ఎండ్ మీడియా రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్సిట్యూట్ విద్యార్ధులకు మరింతగా సహాయపడుతుందన్నారు.

Exit mobile version