మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి బజ్ ని ఆల్రెడీ సొంతం చేసుకున్న ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం హీరో వెంకీ మామ కూడా ఉన్నారు. ఇక అనీల్ రావిపూడి రీసెంట్ గా ఈ సినిమా విషయంలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
మెగాస్టార్ నుంచి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి సుమారు 20 ఏళ్ళు అయ్యింది అని ఆ 20 ఏళ్ల తర్వాత తన నుంచి పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మన శంకర వరప్రసాద్ గారు ఉండబోతుంది అని తాను తెలిపారు. అంతే కాకుండా సంక్రాంతికి వస్తున్నాం కి డబుల్ ఎంటర్టైనర్ గా ఇది ఉంటుంది అని కాన్ఫిడెన్స్ గా చెప్పడం జరిగింది. సో మెగాస్టార్ నుంచి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఆ అవైటెడ్ ఎంటర్టైనర్ ఫ్యాన్స్ కి వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతుందని చెప్పవచ్చు.
