మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ పూర్తి ఫ్యామిలీ డ్రామాగా రానుంది. ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా నుండి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
ఈ సినిమా నుండి ఓ బ్యూటీఫుల్ అప్డేట్‌ను డిసెంబర్ 4న ఉదయం 11.08 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ అప్డేట్ ఏమై ఉంటుందా అనే ఆసక్తి సినీ సర్కిల్స్‌తో పాటు ప్రేక్షకుల్లో నెలకొంది. కాగా, ఇది ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్‌కు సంబంధించిన అప్డేట్ అయ్యి ఉంటుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో కేథరిన్ ట్రెసా మరో కీలక పాత్ర పోషిస్తోంది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అవగా, త్వరలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.
