మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ కానుంది. 2007 లో వచ్చిన మళయాళ సినిమా ‘మిస్సన్ 90 డేస్’ సినిమాకి డబ్బింగ్ వెర్షన్ గా ‘శ్రీ పెరంబదూర్’ అనే పేరుతో రానుంది.
ఈ సినిమాలో రాజీవ్ గాంధీకి సంబందించిన ఎపిసోడ్ కూడా ఉంటుంది. ఈ సినిమాలో ఎక్కువగా థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండనున్నాయి. మజొర్ రవి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మలయాళంలో మంచి హిట్ అయ్యింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు సినిమాలో కొన్ని మార్పులు కూడా చేసారు.
షేక్ మొహమ్మద్ నిర్మాతగా డబ్ చేసిన ఈ సినిమాకి వీరయ్య చౌదరి సమర్పకుడు. మమ్ముట్టి సినిమా తెలుగులో రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది. కావున ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.