పెళ్లి చేసుకున్న మమతా మోహన్ దాస్


ఎంతో టాలెంట్ ఉన్న నటి మమతా అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. ఆమె తన చిన్న నాటి స్నేహితుడు ప్రజీత్ పద్మనాభన్ ను వివాహమాడారు. ఈ వివాహ వేడుక కేరళలోని కోజికోడే లోని ఒక పెద్ద హోటల్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వారి దగ్గరి స్నేహితులు, కుటుంబ సభ్యులు, మలయాళ సినీ పెద్దలు హాజరయ్యారు. మలయాళ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు హాజరయ్యరనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. గత నెలలో దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన ప్రజిత్ తో నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. మమతా మోహన్ దాస్ నటిగానే కాకుండా గాయనిగా కూడా పాపులర్ అయ్యారు. ఈ కొత్త జంటకు వివాహ శుభాకాంక్షలు అందిద్దాం.

Exit mobile version