శ్రీ దివ్య మరియు క్రాంతి నటించిన ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’ సినిమా జూలై 6న భారతదేశమంతటా విడుదలకానుంది. ఒంటరితనంతో సంతోషం అనే పదాన్ని మర్చిపోయిన ఒక గృహిణి తన అభిమాన రచయితను కలుసుకున్నాక తన జీవితంలో కలిగే మార్పులను ఏమిటి అనేది ఈ సినిమా కధాంశం అని దర్శకుడు రామరాజు చెప్పాడు. వీరిద్దరి కవిత్వాల నడుమ, ప్రేమ, వివాహాల నడుమ సాగే ఒక అందమైన ప్రయాణంగా కధను అల్లారు. మారుతి తీసిన ‘బస్ స్టాప్’ లో నటించిన శ్రీ దివ్య ఈ సినిమాతో హిట్ సంపాదించింది. పవన్ కుమార్ సంగీతం అందించాడు. బాలారెడ్డి సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా ప్రీమియర్ జూలై 4న హైదరాబాద్లో ప్రదర్శితమై జూలై6న విడుదలకానుంది. ఈ చిత్రం అమెరికాలో ఎంచుకున్న పలు నగరాలలో జూలై 4న విడుదలకానుంది