చివరి దశలో ఉన్న నిత్యా మాలిని 22

nithya_menon
ఈ సంవత్సరం ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో హిట్ అందుకున్న టాలెంటెడ్ నటి నిత్యా మీనన్ ‘మాలిని 22’వ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమా మలయాళంలో హిట్ అయిన ’22 ఫీమేల్ కొట్టాయం’ సినిమాకి రీమేక్.

శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేసృకుంది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ టైటిల్ రోల్ పోషిస్తోంది. ఉమర్జీ అనురాధ – గౌతం కశ్యప్ డైలాగ్స్ అందిస్తున్న ఈ మూవీకి అనంత్ శ్రీ రామ్ పాటలు రాస్తున్నారు. శ్రీ ప్రియ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి అరవింద్ – శంకర్ సంగీతం అందిస్తున్నాడు. రాజ్ కుమార్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Exit mobile version