తెలుగు నేర్చుకుంటున్న టాలెంటెడ్ హీరోయిన్ !

నటనలో మంచి ప్రతిభావంతురాలైన మలయాళ నటి నజ్రియా ఫహద్ న్యాచురల్ స్టార్ నాని సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రానున్న ఈ రొమాంటిక్ డ్రామాలో నజ్రియా ఫహద్ ది కూడా ప్రధాన పాత్ర. సినిమా కథలో ఆమె పాత్ర చాలా కీలకమైనదనే.. ఆమె ఈ సినిమా కోసం బాగానే కష్ట పడుతొంది. ఇప్పుడు తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతుందట. వివేక్ ఆత్రేయ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నజ్రియా ఫహద్ కు తన పాత్ర కోసం తననే డబ్బింగ్ చెప్పమని ఆమెకు సూచించానని తెలిపారు.

అయితే నజ్రియా ఫహద్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి తెలుగు పై పట్టు కూడా సాధిస్తోందట. మొత్తానికి డబ్బింగ్ చెప్పే ప్రయత్నంలో ఈ నటి చాలా ఉత్సాహంగా ఉందని వివేక్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ఇంకా కొంత సమయం మిగిలి ఉన్నందున, ఈ లోపు నజ్రియా తెలుగు నేర్చుకోవడం ప్రారంభించిందని.. సినిమా పూర్తయ్యేలోవు ఆమె తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెబుతానని మేకర్స్ క్లారిటీ కూడా ఇచ్చిందట. మరి చూడాలి నజ్రియా మరో సాయి పల్లవి అవుతుందేమో.

Exit mobile version