దబాంగ్ 2 లో కలిసి డాన్స్ చెయ్యనున్న మలైకా మరియు కరీనా

దబాంగ్ 2 లో కలిసి డాన్స్ చెయ్యనున్న మలైకా మరియు కరీనా

Published on Nov 9, 2012 2:23 AM IST


హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం “దబాంగ్” తో సల్మాన్ ఖాన్ బాలివుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే ఈ చిత్రం దేశమంతటా ఒక సంచలనం అయ్యింది. తెలుగులో ఈ చిత్రాన్ని “గబ్బర్ సింగ్” గా రీమేక్ చేసిన పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత విజయాన్ని రుచి చూసారు. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ నిర్మిస్తున్నారు సల్మాన్ మరియు సోనక్షి సిన్హాలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అర్బాజ్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అయన ఒక కీలక పాత్ర కూడా పోషిస్తున్నారు ఈ చిత్రంలో ఆయన సతీమణి మలైకా అరోరా ఒక ప్రత్యేక పాటలో కనిపించనున్నారు అంతే కాకుండా ఈ పాటలో కరీనా కపూర్ కూడా మెరవనున్నారు. ఈ కాంబినేషన్ కి సరయిన పాట పడితే జనం ఉర్రూతలూగటం ఖాయం దబాంగ్ 2 చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది.

తాజా వార్తలు