పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ జూలై 24న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి హిస్టారికల్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాతో పవన్ మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
అయితే, ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ వీడియో ఇవ్వాలని ప్లాన్ చేశారు. ఈ చిత్ర మేకింగ్ వీడియోను రిలీజ్ చేయాలని చూసినా కొన్ని టెక్నికల్ కారణాల వల్ల దానిని వాయిదా వేశారు. దీంతో ఈ మేకింగ్ వీడియోను జూలై 19న రిలీజ్ చేస్తామని వారు పేర్కొన్నారు.
ఇక ఈ వాయిదాతో పవన్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. తమ అభిమాన హీరో చేసే స్టంట్స్ ఈ వీడియోలో కనిపిస్తాయని వారు ఆశగా ఎదురుచూశారు. కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.