‘భీష్మ’లో లవ్ సీక్వెన్సెస్ హైలైట్ అట !

‘భీష్మ’లో లవ్ సీక్వెన్సెస్ హైలైట్ అట !

Published on Feb 4, 2020 8:00 AM IST

‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రాబోతున్న చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. అలాగే ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో కూడా ఫుల్ బిజీగా ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెలిసింది. సినిమాలో ‘నితిన్ – రష్మిక’ మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉండబోతుందని.. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే లవ్ సీక్వెన్సెస్ హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది.

కాగా ఈ చిత్రానికి ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉపశీర్షిక. ‘ఛలో’ మాదిరిగాగే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడట. ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలో హైలెట్ అవుతుందని సమాచారం. ఇక నితిన్ లాస్ట్ సినిమా శ్రీనివాస కళ్యాణం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో నితిన్, భీష్మ చిత్రం పై మరింత దృష్టి పెట్టారు. కాగా ఈ సినిమాలో హెబ్బా పటేల్‌ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు