SSMB29 : హైప్ పెంచేస్తున్న మేకర్స్..!

SSMB29

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ SSMB29 కోసం యావత్ సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ సబ్జెక్ట్‌తో రాబోతున్నాడు. ఇక ఈ గ్లోబ్ ట్రాటరింగ్ చిత్ర షూటింగ్ మొదలై చాలా రోజులే అవుతుంది.

కాగా, ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ ఇప్పటికే డేట్ ఫిక్స్ చేశారు. నవంబర్ 15న SSMB29 నుండి థండరింగ్ అప్డేట్ రాబోతున్నట్లు మేకర్స్ తెలుపుతున్నారు. ఇక ఈ అప్డేట్ ఏమిటా.. ఎలా ఉండబోతుందా.. అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ అప్డేట్‌పై హైప్ పెంచుతూ మేకర్స్ తరుచూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. రీసెంట్‌గా మహేష్, రాజమౌళి మధ్య సాగిన ట్వీట్ కన్వర్జేషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది.

ఇక ఇప్పుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ కూడా SSMB29 పై ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. సినిమాను సెలబ్రేట్ చేసుకునే సిటీ హైదరాబాద్ వేదికగా SSMB29 థండరింగ్ ట్రీట్‌ను రెడీ చేస్తున్నామని.. రామోజీ ఫిల్మ్ సిటీలో నవంబర్ 15న సాయంత్రం 6 గంటల నుండి ఈ ట్రీట్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఆయన ఓ వీడియో రూపంలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియోతో మహేష్ ఫ్యాన్స్ మరోసారి SSMB29ను ట్రెండ్ చేస్తున్నారు.

Exit mobile version