మరో అడుగు ముందుకేసిన ‘మేజర్’ టీమ్

మరో అడుగు ముందుకేసిన ‘మేజర్’ టీమ్

Published on Dec 15, 2020 5:32 PM IST

థ్రిల్లింగ్ కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న నటుడు ‘అడివి శేష్’. ‘క్షణం, గూఢచారి, ఎవరు’ లాంటి సినిమాలతో ఆయన క్రేజ్ అంనం పెరిగిపోయింది. చాలామందిలా రెగ్యులర్ కమర్షియల్ అంశాల వెనక పరిగెత్తకుండా కథా బలం ఉన్న సినిమాలే చేస్తూ థ్రిల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న కొత్త చిత్రం ‘మేజర్’. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన ఎన్.ఎస్.జి కమెండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి స్వయంగా నిర్మిస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

ఇటీవలే ఈ సినిమా నుండి లుక్ టెస్ట్ పేరుతో ఉన్నికృష్ణన్, అడివి శేష్ ఫోటోలను పక్కపక్కన ఉంచి రీలీజ్ చేశారు. అందులో శేష్ అచ్చు ఉన్నికృష్ణన్ పోలికలతో అచ్చుగుద్దినట్టు ఆయనలాగానే కనిపించారు. సినిమాలో శేష్ తప్పకుండా ఉన్నికృష్ణన్ ను కళ్ళ ముందు కదిలేలా చేస్తారనే నమ్మకం కుదిరింది. ఈ పాజిటివ్ స్పందనతో ఇంకో అడుగు ముందుకేసి టీమ్ ఫస్ట్ లుక్ విడుదలకు రెడీ అయింది. డిసెంబర్ 17న ఉదయం 10 గంటలకు ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. మరి దీన్ని నిర్మాతల్లో ఒకరైన మహేష్ బాబు విడుదలచేస్తారేమో చూడాలి. ‘గూఢచారి’ దర్శకుడు శశి కిరణ్ తిక్క ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

తాజా వార్తలు