త్వరలో ఆగడు టీం తో కలవనున్న మహేష్ బాబు

త్వరలో ఆగడు టీం తో కలవనున్న మహేష్ బాబు

Published on Dec 25, 2013 9:00 AM IST

mahesh-babu

త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ మాస్ ఎంటర్టైనర్ లో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. మొదటి సారి తమన్నా మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ముగిసింది.

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా శ్రీనువైట్ల తరహాలో కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ బాగా ఎక్కువగా ఉంటుందని సమాచారం. 2011లో ఇదే టీం కాంబినేషన్ లో ‘దూకుడు’ సినిమా వచ్చింది. ప్రస్తుతం మహేష్ బాబు ‘1-నేనొక్కడినే’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

తాజా వార్తలు