“మిల్క్ బాయ్” మహేష్ బాబు మరియు “మిల్క్ వైట్ బ్యూటీ” తమన్నాల కలయిక లో ఒక చిత్రం రాబోతున్నది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి లో షూటింగ్ మొదలు పెట్టుకోనుంది ఇంతకముందే మేము తెలిపినట్టు ఇందులో మహేష్ బాబు “ప్రోఫెస్సర్” పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యాన్నర్ మీద విడుదల చేస్తున్నారు. ఇంతకముందు ఇదే బ్యానర్ మీద మహేష్ బాబు “దూకుడు” వంటి భారి విజయాన్ని అందుకున్నారు.