సరికొత్త ట్రెండ్లు సృష్టించడానికి రెడీ అవుతున్న మహేష్ బాబు సినిమా


సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్లు సృష్టించాబోతున్నారట. మహేష్ బాబు ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ తో సర్ప్రైజ్ చేయబోతుంటే సుకుమార్ విభిన్నమైన కథనంతో కొత్త పుంతలు తొక్కిస్తాను అంటున్నాడు. వీరికి తోడు దేవి కూడా జత కలిసి తెలుగు వారికీ కొత్త సౌండ్ పరిచయం చేయబోతున్నాను అంటున్నాడు. కొత్త సౌండ్ అంటే కొత్త రకమైన సంగీత వాయిద్యాలు వాడుతూ సరికొత్త రకమైన పాటలు ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ఇవన్ని చూస్తుంటే ఈ సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్లు ఖాయం అనిపిస్తుంది. మొదట కథానాయికగా కాజల్ ని అనుకోని కొంత భాగం షూటింగ్ చేసాక ఆమె ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఆమె స్థానంలో మహేష్ బాబు రేంజ్ కి సరిపడేలా మరో కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు.

Exit mobile version