మహేష్ సంక్రాంతి పండుగ అందించిన సరిలేరు నీకెవ్వరు మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్ కోసం అమెరికా వెళ్లిన మహేష్ అక్కడే వారితో ఈ సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. కాగా ఇప్పటికే అనేక కార్పొరేట్ ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉన్న మహేష్, ప్రముఖ సోషల్ మీడియా యాప్ హలో కొరకు పని చేస్తున్నారు. ఇందులో భాగంగా హలో కొరకు ఆయన నటించిన ప్రచార వీడియోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకుంటున్నారు. హలో యాప్ లో నేను మీకు అందుబాటులో ఉంటాను, హలో ఆప్ డౌన్ లోడ్ చేసుకోమని ఫ్యాన్స్ ని కోరుతున్నారు. మహేష్ ప్రచారంతో హలో యాప్ మరింతగా నెటిజెన్స్ కి చేరువకావడం ఖాయంగా కనిపిస్తుంది.
మహేష్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు వంశీ పైడిపల్లి తో ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది మహర్షి మూవీతో మంచి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి మహేష్ కొరకు ఓ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. మే నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
https://www.instagram.com/p/B8IiHwxH7Jr/