సూపర్ స్టార్ మహేష్ ఓ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ఆ చిత్రం ఆయనకు బాగా నచ్చేసిందట. ఇటీవల ఓ మై కడవలె అనే మూవీ ఓ టి టి లో విడుదలయ్యింది.ఈ మూవీ మహేష్ కి బాగా నచ్చేసిందట. ఆద్యంతం ఆ చిత్రాన్ని అయన ఆస్వాదించాడట. అదే విషయాన్ని మహేష్ ట్విట్టర్ లో తెలియజేశారు. ఇక ఆ చిత్ర యూనిట్ బెస్ట్ విషెష్ తెలియజేశారు. మహేష్ ఆ చిత్రాన్ని మెచ్చుకోవడంతో మూవీకి విపరీతమైన క్రేజ్ వచ్చి చేరింది.
మహేష్ సెప్టెంబర్ నుండి సర్కారు వారి పాట మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ మరియు జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ కలసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.
#OhMyKadavule… Enjoyed every bit of it… Superb performances, brilliantly written and directed @Dir_Ashwath. ????????????@AshokSelvan you're a natural???????????? pic.twitter.com/Ozxlz0EP4Q
— Mahesh Babu (@urstrulyMahesh) July 18, 2020