సందీప్ కిషన్ హీరోగా, ‘రొమాన్స్’ ఫేం డింపుల్ హీరోయిన్ గా తెరకెక్కిన ‘యారుడా మహేష్’ సినిమాని తెలుగులో ‘మహేష్’ సినిమాగా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకని ఈ నెల 13వ తేదీ సాయంత్రం 7 గంటలకి చాలా గ్రాండ్ గా శిల్పకళా వేదికలో లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖలు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఏప్రిల్ లో తమిలంలోరిలీజ్ అయిన ఈ సినిమాకి తమిళ్ లో మిశ్రమ స్పందన లభించింది. మదన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎస్.కె పిక్చర్స్ బ్యానర్ పై సురేష్ కొండేటి నిర్మిస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీలో డైలాగ్స్ సినిమాకే హైలైట్ అవుతాయని సమాచారం.