మహేష్ మ్యానియా రష్మికకు భారీగా ప్లస్సయ్యిందా.?

మహేష్ మ్యానియా రష్మికకు భారీగా ప్లస్సయ్యిందా.?

Published on Nov 14, 2020 3:03 PM IST

ఇప్పుడు మన టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే అత్యధిక స్టార్డం ను అందుకున్న హీరోయిన్స్ లో రష్మికా మందన్నా ఒకరు. చిన్న ఆఫర్స్ నుంచే వచ్చినా మెల్లగా భారీ ఆఫర్స్ ను అందుకొని ఇప్పుడు భారీ రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ కి వెళ్లిందట. అయితే ఇప్పుడు ఈమె రెమ్యునరేషన్ విషయంలోనే హాట్ టాపిక్ గా ఓ అంశం నడుస్తుంది.

ప్రస్తుతం రష్మికా ఏకంగా 2 కోట్ల రెమ్యునరేషన్ ను ఛార్జ్ చేస్తుందట. అయితే ముఖ్యంగా దీనికి కారణం సూపర్ స్టార్ మహేష్ తో తాను నటించిన లాస్ట్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు” సినిమా వల్లనే అని తెలుస్తుంది. అప్పటి వరకు ఓ రేంజ్ లో ఉన్న రష్మిక ఈ సినిమా తర్వాత మరిన్ని భారీ ఆఫర్స్ ను దక్కించుకుంటుందని తెలుస్తుంది.

అందుకే ఆమె తన రెమ్యునరేషన్ ను కూడా పెంచగా అంత మొత్తాన్ని ఇచ్చేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారని నయా టాక్. ఇప్పుడున్న యూత్ లో కూడా రష్మికా కు మంచి క్రేజ్ ఉంది. అలాగే మంచి టాలెంట్ తో పాటుగా మహేష్ మ్యానియా కూడా ఆమెకు మరింత రీచ్ ను తీసుకొచ్చినట్టు అయ్యింది.

తాజా వార్తలు