మరో సారి కలిసి కనువిందు చేయనున్న మహేష్ కాజల్ జంట


బిజినెస్ మేన్ సినిమాలో జంటగా నటించి సూపర్ హిట్ అందుకున్న జంట మహేష్ బాబు మరియు కాజల్. ఈ జంట మరో సారి తెరపై కనువిందు చేయనుంది. సుకుమార్ డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాలో కథానాయికగా పలు పేర్లు అనుకున్నప్పటికీ చివరికి కాజల్ ని ఖరారు చేసారు. ఈ నెల 23న షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఒక ప్రత్యేక సెట్లో పాట ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ రక్షిత్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీరు ఇటీవలే మహేష్ బాబుతో దూకుడు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించారు.

Exit mobile version