సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డేకు రెండు వారాల ముందు నుండే సందడి మొదలైంది. సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ సందడి
మొదలు పెట్టారు. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా కామన్ డీపీ విడుదల చేయగా వైట్ అండ్ వైట్ సూట్ లో మహేష్ బాబు స్టైల్ గా నిల్చుని ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.మహేష్ సీడీపీ చాలా ప్రత్యేకంగా ఉందంటూ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
ఇప్పటికే 15 మిలియన్స్ కి పైగా ట్వీట్స్ మహేష్ అడ్వాన్స్ బర్త్ డే విషెష్ పై ట్రెండ్ అయ్యాయి. ఇక మహేష్ సెప్టెంబర్ నుండి సర్కార్ వారి పాట షూటింగ్ లో పాల్గొననున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్ మరియు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పరుశరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.