పూరి రెడీగా ఉన్నాడు..మరి మహేష్ ఏమంటాడో..?

పూరి రెడీగా ఉన్నాడు..మరి మహేష్ ఏమంటాడో..?

Published on Mar 17, 2020 2:25 PM IST

సూపర్ స్టార్ మహేష్, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలిసి చేసిన పోకిరి మూవీ ఇండస్ట్రీ హిట్ కాగా, బిజినెస్ మేన్ ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ లో ఒకటిగా ఉంది. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో మూవీ రావాలని మహేష్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. బిజినెస్ మేన్ సినిమా 2012లో విడుదలైంది. అనగా పూరి, మహేష్ మూవీ చేసి దాదాపు 8ఏళ్ళు అవుతుంది.

ఐతే పూరి ఎప్పటి నుండో మహేష్ తో మూవీ చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మహేష్ ఇతర దర్శకులతో చేస్తున్న మూవీస్ కారణంగా వీరి కాంబినేషన్ సెట్ కాలేదు. పూరి కొంత కాలం వరుస పరాజయాలు చవిచూశారు. ఇది కూడా మహేష్ పూరి పట్ల ఆసక్తి చూపకపోవడానికి ఒక కారణం. ఇప్పటికి కూడా పూరి దగ్గర మహేష్ ఇమేజ్ కి సరిపోయే చాలా స్క్రిప్స్ సిద్ధంగా ఉన్నాయట. మహేష్ ఒకే అంటే త్వరలోనే వీరి ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది. మహేష్ తన తదుపరి చిత్రానికి సంబంధించి ఏ దర్శకుడితో కమిట్ కాలేదు. దీనితో పూరి-మహేష్ కాంబినేషన్ మళ్ళీ వార్తలలోకి వచ్చింది.

తాజా వార్తలు