1-నేనొక్కడినే సినిమా ఎలా ఉండబోతుందంటే…

1Nenokkadine
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘1 నేనొక్కడినే’ సినిమా ప్రస్తుతం నిర్మాణదశలో వుంది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ ద్వారా ఈ సినిమా ఎలా ఉండబోతుందన్న సంకేతాలను మనకు అందించింది.

ఈ సినిమా ఒక స్టైలిష్ థ్రిల్లర్ నేపధ్యంలో భారీ రేంజ్ లో యాక్షన్ సీన్లతో, చేజింగ్ సీన్లతో కనులవిందు చెయ్యనుంది. కధనాల ప్రకారం ఈ సినిమాలో చేజింగ్ సన్నివేశాలు ప్రధానఆకర్షణగా నిలవనున్నాయి. హీరోలకు వైవిధ్యమైన పాత్రను చిత్రీకరించాగల సుకుమార్ ఈ సినిమాకు దర్శకుడు. కృతి సనన్ హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ భారీ బడ్జెట్ థ్రిల్లర్ ను 14 రీల్స్ సంస్థ నిర్మించనుంది.

Exit mobile version