నేటితో ముగియనున్న మహేష్ బాబు లండన్ షెడ్యూల్

mahesh-Nenokkadine

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘1-నేనొక్కడినే’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా లండన్ షెడ్యూల్ ఈ రోజుటితో ముగియనుంది. ఆ తర్వాత ఈ చిత్ర టీం తిరిగి ఇండియాకి రానుంది. ఐర్లాండ్, యుకె బ్యాక్ డ్రాప్ లో అధ్బుతమైన లోకేషన్స్ లో షూటింగ్ చేసిన ఈ షెడ్యూల్ తో ఈ సినిమాలోని మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో బ్యాంకాక్ లో మొదలు కానున్న షెడ్యూల్లో కొన్ని ఫైట్ సీక్వెన్స్ లను షూట్ చేయనున్నారు.

సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ‘1-నేనొక్కడినే’ ఫుల్ యాక్షన్ ఉంటూ ఆద్యంతం సస్పెన్స్ తో సాగే ఈ థ్రిల్లర్ సినిమాని 2014 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version