నవంబర్ నుండి మహేష్ ఆగడట

mahesh-Nenokkadine

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘1-నేనొక్కడినే’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. ఈ చిత్రం తరువాత మహేష్ శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరక్కబోతున్న ‘ఆగడు’ సినిమాలో నటిస్తాడు. తాజా సమాచారం ప్రకారం సూపర్ స్టార్ నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ లో పల్గుంటాడట

ఈ రెండు ప్రాజెక్ట్ లనూ 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ యే నిర్మిస్తుంది. ఈ సినిమాల నిర్మాతలైన రామ్ ఆచంట, గోపి ఆచంటమరియు అనీల్ సుంకర మహేష్ కు సన్నిహితులు. ‘1-నేనొక్కడినే’ సినిమా 2014 సంక్రాంతికి విడుదలకానుంది

‘1-నేనొక్కడినే’ సినిమా స్టైలిష్ సస్పెన్స్ తరహాలో సాగనుంది. ‘ఆగడు’ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది

Exit mobile version