సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. దీని కోసం ఒక భారీ సెట్ ను నిర్మించారు. ఈ సెట్లో కొన్ని ఫైట్ సీక్వెన్స్ లు షూట్ చేస్తున్నారు. మేము ఇదివరకూ తెలియజేసినట్టు సల్మాన్ ఖాన్ ‘ఏక్ థా టైగర్’ కి ఫైట్స్ కంపోజ్ చేసిన టీం ఈ ఫైట్ సీక్వెన్స్ లను కంపోజ్ చేస్తున్నారు.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి అధికారికంగా ఇంకా టైటిల్ ని ఖరారు చేయలేదు. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమాని మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఆగష్టు 9న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘ఏక్ థా టైగర్’ సినిమాలో ఫైట్ సీక్వెన్సులు సూపర్బ్ గా ఉంటాయి కావున ఈ సినిమాలో కూడా అదిరిపోయే స్టంట్స్ ఉంటాయని ఆశించవచ్చు.