సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రసిద్ది పొందిన క్రిస్ గేతిన్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. గెతిన్ ట్రైనింగ్ లో మహేష్ బాబు బాడీ పూర్తిగా మారిపోనుంది. ఈ మారిపోయిన బాడీని మనం తన రాబోవు సినిమాలో చూడవచ్చు. క్రిస్ గేతిన్ కి డిటీపీ (డైనమిక్ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రిన్సిపల్)ద్వారా భారీగా బాడీని, మజిల్స్ ని ఎలా పెంచాలో తెలుసు. మహేష్ బాబు సుకుమార్ సినిమా కోసం బాడీని పెంచుతున్నాడని సమాచారం.
మహేష్ బాబు చాలా రోజుల తర్వాత ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ విజయాన్ని కూడా పంచుకోవడం జరిగింది. అలాగే శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సినిమా ‘బాద్షా’ సినిమా గురించి ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్స్ మీ కోసం అందిస్తున్నాం..
‘గత మూడు నెలలుగా ఎంతో చాలెంజింగ్ గా ఉంది. మీకు తెలుసు నేను ప్రపంచ ప్రసిద్ది పొందిన క్రిస్ గెతిన్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నానని’.
‘నేను ఈ డీటీపీ ఛాలెంజ్ గా తీసుకుని దాన్ని సాధించాను. ఆ కోర్స్ మొత్తం పూర్తవడంతో పూర్తిగా మారిపోయాను. ఈ కొత్తలుక్ మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’.
‘బాద్షా సినిమా చూశాను ప్రతి చోట శ్రీను వైట్లనే కనిపించాడు. శ్రీను గారు మరోసారి మీరు సినిమాని కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడంలో కింగ్ అనిపించుకున్నారు’
‘కాస్త లేటుగా చెబుతున్నా, కానీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాని సూపర్ సక్సెస్ చేసినందుకు మీకందరికీ థాంక్స్’.