మహేష్ బాబు ‘1’ మూవీ కొత్త షెడ్యూల్ డేట్

Mahesh-Babu-Nenokkadine-Mov

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘1- నేనొక్కడినే’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ చిత్ర యూనిట్ లాంగ్ యుకె షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చారు. ఇక్కడ ఈ సినిమాకి సంబందించిన షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ నెల 27 నుంచి లేదా ఈ నెల చివరి నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ద్వారా కృతి సనన్ హీరోయిన్ గా పరిచయమవుతోంది.

మహేష్ బాబు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేస్తున్న ఈ మూవీకి రత్నవేల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బాన్నెర్ వారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2014 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version