హైదరాబాద్ లో ‘1’కి భారీ ఓపెనింగ్స్

1_Nenokkadine
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమా హైదరాబాద్ లో భారీగా రిలీజ్ కానుంది. తాజా సమాచారం ప్రకారం ఒక్క హైదరాబాద్ లోనే 108 థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. అలాగే అన్ని మల్టీ ప్లెక్సులలో అన్ని స్క్రీన్స్ లో ఎక్కువ షౌస్ వెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. మొదటి రోజుకి సంబందించిన షో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సుకుమార్ దర్శకత్వం వహించిన ‘1’ సినిమా ఈ సంవత్సరం ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి. ఇప్పటికే మహేష్ బాబు 1 సినిమా తన కెరీర్లో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని అనడంతో అభిమానులు జనవరి 10 కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. జనవరి 1న రిలీజ్ చేసిన ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ కానున్న ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి సంబందించిన ఆన్ని రైట్స్ ని ఈరోస్ ఇంటర్నేషనల్ వారు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు.

Exit mobile version