సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మల్టీ స్టారర్ సినిమాకి డబ్బింగ్ చెప్పడం ఈ రోజుటితో పూర్తి కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాని జనవరి 11న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి ప్రీమియర్ షో జనవరి 10వ తేదీ రాత్రి 10 గంటల 34 నిమిషాలకు వేయనున్నారని సమాచారం.
విక్టరీ వెంకటేష్ – మహేష్ బాబు అన్నదమ్ములుగా కనిపిస్తున్న ఈ సినిమాలో వీరికి తల్లి తండ్రులుగా ప్రకాష్ రాజ్ – జయసుధ కనిపించనున్నారు. సమంత, అంజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు.