మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో నవతర యువ హీరోగా పరిచయం అయ్యాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. నూతన దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “ఉప్పెన”. ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రంపై చాలా మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ ఊహించని విధంగా కరోనా అడ్డు రావడంతో ఆగాల్సి వచ్చింది.
అయితే ఈ సుకుమార్ అండర్ లో అందులోనూ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కావడం పైగా దేవి ఇచ్చిన రెండు పాటలు బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ కావడంతో మంచి అంచనాలు వచ్చాయి. ఇప్పుడు ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి మూడవ పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనున్నారు. ఈ వచ్చే నవంబర్ 11న దీపావళి కానుకగా సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నారు. మరి ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్టవుతుందో చూడాలి.