సుకుమార్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమాలో కొత్త గెటప్ తో కనిపించాబోతున్నాడనే విషయం చాలా రోజుల నుండి వినిపిస్తుంది. మహేష్ ఈ సినిమాలో రాక్ స్టార్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. తన ప్రతి సినిమాలో హీరో పాత్ర తీరు, గెటప్ విభిన్నంగా ఉండేలా చూసుకునే సుకుమార్ ఈ సినిమాకోసం మహేష్ పాత్రని చాలా విభిన్నంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఈ సినిమాకి తుంటరి అనే టైటిల్ అని గుసగుసలు వినిపించగా నిర్మాత అనిల్ సుంకర మా సినిమాకి తుంటరి టైటిల్ కాదని ఇంకా ఏ టైటిల్ ఖరారు చేయలేదని తెలిపారు. మహేష్ సరసన కొత్త హీరోయిన్ కృతి సనన్ నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో మహేష్ బాబుతో దూకుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన 14 రీల్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాని కూడా నిర్మిస్తుంది.