టాలీవుడ్ అందగాడు మరియు ఎంతో మంది అమ్మాయిల మనసు దోచుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. స్టైల్ కి ఐకాన్ గా మారిన మహేష్ బాబు ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలోని నిర్మాతలకు కూడా డార్లింగ్ గా మారాడు. మహేష్ బాబు అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉండడం, ఎంతో అంకిత భావంతో పనిచేయడం మరియు నిత్మాతల అభిరుచులను గౌరవించి వాటికి తగ్గట్టుగా నడుచుకుంటారు. అందువలనే ఆయనతో పని చేసిన ప్రతి నిర్మాత మళ్ళీ మహేష్ తో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తి చూపుతారు.
అలాగే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు సూపర్బ్ లుక్స్ ఆయనకున్న ప్రత్యేక ఆకర్షణ. మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఓ చిత్రంలో మరియు దిల్ రాజు నిర్మిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఇద్దరు నిర్మాతలు మహేష్ బాబుతో మళ్ళీ కలిసి పనిచేయాలని ఉందని అన్నారు. మహేష్ బాబు ‘దూకుడు’ మరియు ‘బుజినెస్ మాన్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో తన మార్కెట్ వాల్యూని పెంచుకుని మరియు నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టారు. అలాంటప్పుడు నిర్మాతలకు మహేష్ డార్లింగ్ కావడంలో వింత ఏమైనా ఉందంటారా?