సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం చాలా విరామం తరువాత సెప్టెంబర్ 17 నుండి హైదరాబాద్లో నూతన షెడ్యూల్ మొదలు పెట్టుకోనుంది. రెండు నెలల క్రితం ఈ చిత్రంలో ఒక పాటను అన్నపూర్ణ స్టూడియోస్ సెవెన్ ఎకర్స్ లో చిత్రీకరించారు తరువాత మహేష్ బాబు “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్ర చిత్రీకరణలో పాల్గొంటూ వచ్చారు. ఆ చిత్రంలో చాలా వరకు మహేష్ పాత్ర పూర్తవడంతో పాటు కాజల్ తిరిగి ఇండియా రావటంతో సుకుమార్ కొత్త షెడ్యూల్ ని ప్లాన్ చెయ్యాలని అనుకున్నారు. గోపీచంద్,ఆచంట రామ్ మరియు అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ బాబు చిత్రం కోసం దేవి శ్రీ ప్రసాద్ పని చెయ్యడం ఇదే మొదటి సారి తను మంచి ఆల్బం ఇస్తానని ఇప్పటికే అభిమానులకు ప్రమాణం చేశారు కూడా. ఈ చిత్రం మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది అని, మహేష్ బాబు కెరీర్ లో ఇదే స్టైలిష్ చిత్రం కానుంది అని అంటున్నారు.