సూపర్ స్టార్ మహేష్ బాబు – కామెడీ యాక్షన్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘దూకుడు’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. మళ్లీ సమె కాంబినేషన్ రిపీట్ చేస్తూ 14 రీల్స్ సంస్థ మరో సినిమా నిర్మించనున్న విషయం తెలిసిందే. ‘ఆగడు’ అని టైటిల్ ఖరారు చేసిన ఈ సినిమా జూలై నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం సుకుమార్ షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ బాబు ఆ సినిమా షూటింగ్ పూర్తవగానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విజయంతో జోరుమీదున్న మహేష్ బాబు వంశి పైడిపల్లి, క్రిష్, పూరి జగన్నాధ్ సినిమాలు కూడా అంగీకరించాడు.