ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం బాలీవుడ్ సినిమా అంటే కాస్త సుముఖంగా లేడు. అతని లుక్, స్టైల్ బాలీవుడ్ సరిపోతున్నప్పటికీ మహేష్ మాత్రం అంత మక్కువ చూపడం లేదు. అలాగే బాలీవుడ్ లో నటించాలని పెద్దగా ప్రయత్నాలు కూడా చేయడం లేదు.
తాజాగా ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు తన బాలీవుడ్ ప్లాన్స్ గురించి చెప్పాడు. ‘ నాకు ఎన్నో ఆఫర్స్ వచ్చాయి కానీ అవేవి నన్ను మెప్పించేలా లేవు. అలాగే నేను కూడా ఇక్కడ మరో 2 సంవత్సరాలు బిజీగా ఉండనున్నాను. ఎవరన్నా పెద్ద డైరెక్టర్ మంచి స్క్రిప్ట్ తో వస్తే అప్పుడు ఆ విషయం గురించి ఆలోచిస్తానని’ అన్నాడు.
మహేష్ బాబు ప్రస్తుతం ‘1-నేనొక్కడినే’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.