మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు సూపర్ స్టార్ మహేష్ ల కాంబో లో వచ్చిన రెండో చిత్రం “ఖలేజా”లో ప్రధాన ఇతివృత్తం దేవుడు ఎక్కడో ఉండడు మనలోనే ఉంటాడు అని. సరైన టైం వచ్చినప్పుడు బయటకు వస్తాడని సూపర్ స్టార్ మహేష్ రీల్ లైఫ్ లో అంటారు.
కానీ నిజ జీవితంలో కూడా దైవం మానుష్య రూపేణా అని మహేష్ బాబు నిరూపించారని మరోసారి అతని ఫ్యాన్స్ గర్వపడుతున్నారు. మహేష్ బాబు ఇప్పుడు వెకేషన్ లో ఉన్నప్పటికీ చిన్నారి గుండె చప్పుడు మాత్రం ఇక్కడ ఆగనివ్వడం లేదు. అలా ఇప్ప్పుడు మహేష్ చలవతో మరో చిన్నారి గుండె ఊపిరి అల్లుకొని ఆపరేషన్ ద్వారా రక్షించబడింది.
ఇదే విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత తెలిపారు.అలాగే దీపావళికి బాణాసంచా బదులు ఒక మొక్కని నాటితే కాలుష్యాన్ని కాస్తయినా అరికట్టిన వాళ్ళం అవుదామని ఆమె సందేశం. అయితే మహేష్ కాపాడిన 1016 వ ప్రాణంగా ఈ చిన్నారి ప్రాణం నిలిచింది అని తెలుస్తోంది. మామూలుగా ఏదన్నా పండుగకు తమ అభిమానుల కోసం తాము చేస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ తో గిఫ్ట్ ఇస్తారు. కానీ మహేష్ ఇచ్చిన ఈ దీపావళి గిఫ్ట్ కన్నా విలువైనది వారి అభిమానులకు ఇంకేముంది?
https://www.instagram.com/p/CHk9ykgDUdj/?utm_source=ig_web_copy_link