థమ్సప్ దేశ వ్యాప్త బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు!

థమ్సప్ దేశ వ్యాప్త బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు!

Published on Mar 1, 2012 4:00 PM IST


మహేష్ బాబు మరో పెద్ద బ్రాండ్ ప్రతిష్టాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు. మొట్ట మొదటి సరిగా ఒక తెలుగు నటుడు నటించిన కమర్షియల్ యాడ్ ఆంధ్ర ప్రదేశ్లోనే కాకుండా దేశమంతటా ప్రదర్శితం కానుంది. ప్రముఖ కూల్ డ్రింక్ కంపెనీ థమ్సప్ కి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు నటించిన యాడ్స్ ఆంధ్ర ప్రదేశ్ కి మాత్రమే పరిమితంయ్యేవి. దేశ వ్యాప్తంగా అక్షయ్ కుమార్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవారు. ఇప్పుడు ఆయన స్థానంలో మహేష్ బాబు చేరిపోయారు. మహేష్ పాపులారిటీ దేశ వ్యాప్తంగా వ్యాపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ యాడ్ కి సంబందించిన సన్నివేశాలు ఇటీవలే బ్యాంకాక్లో చిత్రీకరించారు.

తాజా వార్తలు