థ్రిల్లర్ సినిమాతో రెడీ అవుతున్న మహేష్ బాబు

Mahesh-Babu
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ప్రపంచం మొత్తం మీద బాగా ఆడుతాయి. ఈ జోనర్ లో తీసే సినిమాలకు ఎలాంటి బౌండరీలు మరియు భాషతో సంబంధం ఉండదు. ఉదాహరణకి ‘బోర్న్ ఐడెంటిటీ’ సీరీస్ ప్రపంచంలోనే పేరున్న థ్రిల్లర్ సినిమా, ఆ సినిమాలకు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే అలాంటి ఓ థ్రిల్లర్ సినిమాతో మనముందుకు రానున్నాడు. ఆ సినిమానే ‘1 – నేనొక్కడినే’. ఈ సినిమా ఎన్నో చేజ్ లతో, ఆసక్తి కరమైన సీన్స్ తో, థ్రిల్లింగ్ సీక్వెన్స్ లతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్. డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకేక్కిస్తున్నాడు. ప్రొడక్షన్ టీం ఈ భారీ బడ్జెట్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బన్నె వారు నిర్మిస్తున్న ఈ సినిమా 2014 జనవరిలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version