ఆగడు సినిమా షూటింగ్ లో మహేష్ బాబు అలిసిపోయే అంత విధంగా నవ్వుకుంటున్నాడు, శ్రీనువైట్ల దర్శకత్వంలో దూకుడు కామిబినేషణ్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుపుకుంటుంది. ఇటీవలే మహేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. గతకొన్ని రోజులుగా కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ సినిమా బృందం మహేష్ కామెడి టైమింగ్, ఎనెర్జీ లెవెల్ లను చూసి ఆశ్చర్యపోతున్నారు
రాయలసీమ నేపధ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో కామెడి ప్రాధాన ఆకర్షణగా నిలవనుంది. “శ్రీనువైట్ల మార్కు సీన్ లు, సూపర్ స్టార్ ఉత్తమ నటన కలిస్తే నవ్వుకు ఆగడం వుంటుందా” అని నిర్మాతలలో ఒకరైన అనీల్ సుంకర ట్వీట్ చేసారు. తమన్నా హీరోయిన్. ప్రకాష్ రాజ్ విలన్
థమన్ సంగీత దర్శకుడు. కె.వి గుహన్ సినిమాటోగ్రాఫర్. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థఈ సినిమాను నిర్మిస్తుంది