‘దూకుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు – డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కనున్న మరో సినిమా ‘ఆగడు’. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై గత కొన్ని రోజులుగా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. మొదట తమన్నా, ఆ తర్వాత శృతి హాసన్, ఆతర్వాత కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ ఇలా పలువురి పేర్లు వినిపించాయి. కానీ ఈ చిత్ర టీం ఆ వార్తలకు తెరదించింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మిల్క్ బ్యూటీ తమన్నాని ఎంపిక చేసారు.
నటన పరంగా, గ్లామర్ పరంగా తన టాలెంట్ నిరూపించుకున్న తమన్నా గత కొద్ది రోజులుగా సరైన ఆఫర్స్ లేక సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఈ ఇలాంటి తరుణంలో మహేష్ బాబు సరసన ఆఫర్ రావడం చెప్పుకోదగిన విషయం. మొదటి సారి తమన్నా మహేష్ బాబు సరసన నటించనుంది. ‘ఆగడు’లో ‘దూకుడు’ కంటే మించి ఎంటర్టైన్మెంట్ ఉండేలా డైరెక్టర్ శ్రీను వైట్ల ప్లాన్ చేస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. ఈ నెల 25నుంచి ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించనున్నారు.