ఒకే సమయంలో వేరువేరుగా షూటింగ్ చేస్తున్న మహేష్ బాబు – గౌతమ్

ఒకే సమయంలో వేరువేరుగా షూటింగ్ చేస్తున్న మహేష్ బాబు – గౌతమ్

Published on Oct 22, 2013 6:38 PM IST

Mahesh-Babu-son
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అతని కుమారుడు గౌతమ్ ‘1-నేనొక్కడినే’ సినిమా కోసం ఒకేసారి వేరు వేరు ప్రాంతాల్లో షూటింగ్ లో పాల్గొంటున్నారు. రెండు ప్రొడక్షన్ టీమ్స్ వీరి ఇరువురి షూటింగ్ కోసం పనిచేస్తున్నాయి. మహేష్ బాబు షూటింగ్ నానక్రాంగూడాలో జరుగుతోంది. అలాగే గౌతమ్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2010 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం సోషల్ నెట్వర్క్ లో లీక్ అయిన కొన్ని ఫోటోలు ఈ సినిమాపై మంచి క్రేజ్ ని తెచ్చాయి. కానీ ఈ ఫోటోలను అధికారికంగా విడుదల చేయలేదు. అసలు ఎవరు చేసారా అనేది తెలుసుకోవడం కోసం ఈ చిత్ర ప్రొడక్షన్ టీం పోలీసుల సాయం తీసుకుంటోంది.

కృతి సనన్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపి ఆచంట – అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు