ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ హొంబలే ఫిలింస్ నుంచి వచ్చిన యానిమేషన్ డివోషనల్ చిత్రం ‘మహావతార్ నరసింహా’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా అంచనాలు లేవు.
కానీ, రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి మౌత్ టాక్ ఎంతో సాయపడింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.60 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటింది. ఇక ఇప్పుడు ఈ సినిమా బుక్ మై షోలో మరో ఫీట్ సాధించింది.
ఈ సినిమా కోసం బుక్ మై షోలో ఏకంగా 2 మిలియన్ కి పైగా టికెట్లు బుక్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంత ఆసక్తిని చూపుతున్నారో అందరికీ అర్థమవుతుంది. ఇక ఈ వీకెండ్ కూడా ఈ చిత్రం మరిన్ని వసూళ్లు కలెక్ట్ చేయడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.