యూఎస్ మార్కెట్ లో కూడా సాలిడ్ వసూళ్లతో ‘మహావతార్ నరసింహ’

యూఎస్ మార్కెట్ లో కూడా సాలిడ్ వసూళ్లతో ‘మహావతార్ నరసింహ’

Published on Aug 5, 2025 7:00 AM IST

mahavatar-narasimha

రీసెంట్ గా ఒక చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది మహావతార్ నరసింహ అనే చెప్పాలి. దర్శకుడు అశ్విన్ తెరకెక్కించిన ఈ గ్రాండ్ విజువల్ అండ్ డివోషనల్ యాక్షన్ డ్రామా సాలిడ్ హిట్ అయ్యి మంచి వసూళ్లు అందుకుంటుంది. ఇలా యూఎస్ మార్కెట్ లో లేట్ గానే విడుదల అయినప్పటికీ అక్కడ కూడా సెన్సేషనల్ వసూళ్లు ఈ సినిమా అందుకుంటుంది.

జస్ట్ గత వారమే విడుదల అయ్యిన ఈ సినిమా ఈ కొన్ని రోజుల్లోనే 3 లక్షల డాలర్లు మార్క్ ని దాటేసి స్ట్రాంగ్ రన్ తో దూసుకెళ్తుంది. దీనితో యూఎస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా అదరగొడుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి సామ్ సి ఎస్ అద్భుతమైన సంగీతం అందించగా క్లీమ్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు