ఇన్ఫోసిస్ లో పని చేసి డైరెక్టర్ గా మారిన వ్యక్తి మధుర శ్రీధర్. ఆయనకు ఒక ఆడియో కంపనీ కూడా వుంది. ఇటీవల ఈయన తీసిన సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయి. ఇప్పుడు శ్రీధర్ ‘ఐ ఆమ్ నాట్ సచిన్’ అనే పేరుతొ మరో సినిమా తీయనున్నాడు
ఈ సినిమా క్రికెట్ చుట్టూ తిరుగుతుంది. T20 ల కాలంలో బెట్టింగ్ ల సంస్కృతి నడుస్తున్న రోజులివి. అప్పుడప్పుడే ఎదుగుతున్న ఒక క్రికెటర్ అనుకోని పరిస్థుతుల వలన ఎలాంటి కష్టాలలో చిక్కుకున్నాడు అన్నది ఈ సినిమా నేపధ్యం. ఈ చిత్రం మే లో షూటింగ్ ముగించుకోనుంది
అంతేకాక మధుర శ్రీధర్ హిందీలో ఘనవిజయం సాధించిన విక్కీ డోనార్ తెలుగు వెర్షన్ అయిన ‘దానకర్ణ’ సినిమాను తీయడంలో కూడా బిజీగా వున్నాడు