‘ఇట్స్ మై లవ్ స్టొరీ’ మరియు ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ సినిమాలను తీసిన మధుర శ్రీధర్ ప్రస్తుతం ‘విక్కీ డోనార్’ తెలుగు వెర్షన్ తియ్యడానికి సిద్ధమయ్యాడు. హిందీలో ఈ
ఆయుష్మాన్ ఖురానా మరియు యామి గౌతం నటించిన ఈ సినిమా గత ఏడాది అక్కడ ఘనవిజయం సాధించింది. ఇప్పటికే మధుర శ్రీధర్ ‘విక్కీ డోనార్’ సినిమాను తెలుగులో తీస్తున్నట్లు తెలిపాడు. ‘దాన కర్ణ’ అనేది సినిమా టైటిల్. ప్రధాన తారాగణం ఇంకా ప్రకటించాల్సివుంది. కధనాల ప్రకారం ఈ సినిమాకు నాని, రానాలను సంప్రదించినా వారు బిజీగా ఉండడం చేత కుదరలేదు. శ్రీధర్ మరో యువ హీరోను సంప్రదించినా అదికూడా విఫలయత్నంగానే ముగిసింది. కొత్త హీరోతో సినిమా తీసే సూచనలున్నాయి. హీరోయిన్ కూడా ఖరారుకాలేదు. స్పెర్మ్ లను దానం చేసే ఒక యువకుడు ప్రేమలో పడ్డాక తన జీవితం ఎలా మలుపుతిరిగిందనే కధలో హీరో ఎవరో చూడాలి మరి