నదియా తరువాత ఇదివరకటి తరం నటి మరొకరు మరోసారి వెండితెర మీదకు రానున్నారు. ఈ సారి మధుబాల అమ్మ పాత్రలో ‘అంతకుముందు.. ఆ తరువాత’ సినిమా ద్వారా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. 1990లలో మధుబాల మణిరత్నం తీసిన ఎవర్ గ్రీన్ హిట్ ‘రోజా’ ద్వారా మనకు పరిచయం అయింది. ఆ తరువాత తను కె. రాఘవేంద్రరావు ‘అల్లరి ప్రియుడు’, శంకర్ ‘జంటిల్ మాన్’ సినిమాలలో నటించింది. ఆ తరువాత ముంబాయిలో సెటిల్ అయిపోయి అక్కడే హిందీ సినిమాలలో నటించింది.
ఇప్పుడు ఈ ‘అంతకుముందు.. ఆ తరువాత’ సినిమాని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. కె.ఎల్ దామోదర్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాత. ఎం.ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో హీరో. అతని తల్లిగానే మధుబాల కనిపించనుంది. మిగిలిన తారలు తదితర వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. ఈ సినిమా త్వరలో మొదలుకానుంది.